ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలి
ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి,ఆర్‌డీఓ కృష్ణవేణి..
ములుగు జూన్ 30 మనవార్త
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి ఓటరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి కృష్ణవేణి అధికారులకు సూచించారు.మంగళవారం ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి కృష్ణవేణి వెంకటాపూర్ మండలంలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 1, 7, 10, 15లను సందర్శించి ప్రత్యేక సవరణ కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందజేయడం, వాటిని సక్రమంగా పూరింపజేయించడం, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయడం వంటి అంశాలపై బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.ఎన్యూమరేషన్ ఫారాల ఆన్‌లైన్ ధృవీకరణ, సమర్పణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదు, ధృవీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న రికార్డులు, అవసరమైన ఏర్పాట్లు, సిబ్బంది నిర్వహణను పరిశీలించిన ఆమె, ఓటరు జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.ఈ పర్యటనలో వెంకటాపూర్ మండల తహసీల్దార్ గిరిబాబు, ఎన్నికల విభాగం సిబ్బంది నితీష్, ఆర్‌ఐ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలి ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి,ఆర్‌డీఓ కృష్ణవేణి..
Quick Summary:
కవిరాజు