Telangana
అనంతారంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు : భక్తిశ్రద్ధలతో వేడుకలు....
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ బోనాలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా బయలుదేరగా,యువకులు కేరింతలు కొడుతూ వేడుకలకు ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.శివశక్తుల పూనకాల నడుమ గ్రామదేవత పోచమ్మ ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని,ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల వేడుకల్లో గ్రామ ప్రజలు,మహిళలు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.