ఇల్లంతకుంట,జూన్ 10 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,ఈ నెల 7న రాత్రి రేపాక గ్రామానికి చెందిన రణం పోశవ్వ,ఆమె కుమార్తెలు ఇంటి బయట మంచంపై కూర్చొని ఉండగా అదే గ్రామానికి చెందిన జోగు మల్లేశం బూతు మాటలు మాట్లాడాడు.దీనిపై ప్రశ్నించగా మల్లేశం భార్య రాజవ్వ, కుమారుడు జోగు సందీప్ ఫిర్యాదుదారురాలి కుమార్తె రణం రేణుకతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు.ఈ క్రమంలో రణం రేణుకపై ఇటుకరాయితో దాడి చేయడంతో పాటు మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందిందన్నారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు,మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ప్రధాన నిందితుడు జోగు సందీప్ (30)ను అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.మహిళలు,చిన్నారులపై జరిగే నేరాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని,వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సిరిసిల్ల అశోక్ హెచ్చరించారు.
Telangana
మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు..
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త