ఇల్లంతకుంట, జూన్ 24 (మన వార్త ప్రతినిధి);
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ హాస్పిటల్ ఆధ్వర్యంలో,డాక్టర్ జగన్ మోహన్ రావు సహకారంతో బుధవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి నోటి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.దంత వైద్యులు డాక్టర్ స్నేహ,డాక్టర్ ఆకాంక్ష,డాక్టర్ ప్రియాంక విద్యార్థులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత మాట్లాడుతూ విద్యార్థుల్లో దంత ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు సహకరిస్తున్న శ్రీరామ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.డాక్టర్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ మండల కేంద్రంలోని శ్రీరామ హాస్పిటల్‌లో ప్రతిరోజూ దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.దంత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నిపుణుల సేవలు పొందవచ్చన్నారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దంత వైద్యులు ప్రతిరోజూ అందుబాటులో ఉండి చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్ చంద్ర, ప్రదీప్ రెడ్డి,డెంటల్ అసిస్టెంట్ లత,విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహణ..విద్యార్థులకు దంత పరీక్షలు,మందుల పంపిణీ...
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త
