సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 11 మన వార్త :మచ్చ బొల్లారం సిటిజన్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు పలువురు సభ్యులు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌ను కలిసి రోడ్ నం.10లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఇటీవల ఆ ప్రాంతంలో డ్రైనేజీ పైప్ లైన్ ఏర్పాటు పనులు చేపట్టడంతో రహదారి దెబ్బతిని, వర్షపు నీరు నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడిందని వారు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, రహదారిని తక్షణమే పునరుద్ధరించి కొత్తగా వేయాలని కోరారు.వినతి పత్రాన్ని స్వీకరించిన కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ సమస్యను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లి అవసరమైన పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిటిజన్ కాలనీ నివాసితులు ప్రసన్న కుమార్, భిక్షపతి రెడ్డి, నీలవేణి, విక్కీ తదితరులు పాల్గొన్నారు.
Medchal -Malkajgiri District
సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి.
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని