-కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 5 మన వార్త : అల్వాల్
స్టేషన్ రోడ్ కాలనీలో కొనసాగుతున్న మురుగునీటి సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులైన శేఖర్, యాదగిరి, జార్జ్, అరుణ్, సాజిద్‌లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.పనుల పరిశీలన అనంతరం కాలనీ వాసులతో మాట్లాడిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, వారి సమస్యలు మరియు అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు కాలనీలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. కాలనీ అభివృద్ధి కోసం కొత్త సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.కాలనీవాసుల అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం తమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కాలనీలో చేపడుతున్న సీవరేజ్ పైప్‌లైన్ పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.కాలనీవాసులు తమ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని స్పందించిన మాజీ కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Telangana
ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన...
Quick Summary:
ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన...