ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 25 మన వార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అల్వాల్ పరిధిలోని ఇందిరానగర్ మహిళా భవన్ వద్ద ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు పండుగ వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అల్వాల్ డీసీఎంసీ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు సబితా అనిల్ కిషోర్, విజయశాంతి, బీఆర్‌ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు ప్రభుత్వానికి మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
Medchal -Malkajgiri District
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
