ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం,
హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 11మన వార్త : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆల్వాల్ చౌరస్తాలో ఆల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ "అలైవ్ లైవ్ ప్రోగ్రామ్"లో ఆల్వాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వంటి చర్యలు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఇటువంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతాయని, బాధిత కుటుంబాలకు జీవితాంతం తీరని వేదనను మిగులుస్తాయని పేర్కొన్నారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సిగ్నల్స్‌ను జంప్ చేయకూడదని, రాంగ్ సైడ్‌లో ప్రయాణించకూడదని, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడబోమని హామీ ఇచ్చారు. రోడ్లను మరింత సురక్షితంగా మార్చేందుకు ట్రాఫిక్ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆల్వాల్ పోలీసులు వెల్లడించారు. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Medchal -Malkajgiri District
ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన.
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
