ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 8 మన వార్త :: బీజేపీలో అంతర్గత విభేదాలకు అద్దం పట్టేలా మారిన ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ వివాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీల వ్యవహారంలో బండి సంజయ్ అనుచరుడిగా గుర్తింపు పొందిన బీజేపీ నాయకుడు జన్యావుల రామకృష్ణ పాత్ర ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చినట్లు సమాచారం.
కూకట్‌పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సాక్ష్యాలను పరిశీలించి నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో A1గా జన్యావుల రామకృష్ణ, A2గా గాజుల రాకేష్ (పీఏ), A3గా సయ్యద్ కుద్రుత్ అహ్మద్, A4గా సయ్యద్ మెహ్రాజ్, A5గా షేక్ కలీం, A6గా నజీర్ ఉద్దీన్లను పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.
వివాదాస్పద ఫ్లెక్సీలలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లపై ఆరోపణలు చేస్తూ, వారి మధ్య వ్యక్తిగత, రాజకీయ విభేదాలను ప్రస్తావించిన విషయం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తి బండి సంజయ్‌కు సన్నిహితుడిగా ఉండటం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే, ఈ ఘటన వెనుక అసలు ఉద్దేశాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత చర్య మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ వ్యవహారంపై అధికారికంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్‌ల నుంచి స్పందన రావాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Telangana
ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ
Quick Summary:
ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ


