పార్కు స్థలంలో నిర్మాణాలకు అనుమతులా?
భీంరావు కాలనీలో వివాదం.. బిల్డింగ్ పర్మిట్ రద్దు చేయాలని నివాసితుల డిమాండ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూలై 6మన వార్త :అల్వాల్ సర్కిల్ పరిధిలోని భీంరావు నగర్ కాలనీలో పార్కుగా కేటాయించిన స్థలానికి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి ఇంచార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి కాలనీవాసులు కలిసి అల్వాల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు.సంబంధిత నిర్మాణ అనుమతులను వెంటనే రద్దు చేయాలని భీంరావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు రిటైర్డ్ సి.జి. గణేష్ ఆధ్వర్యంలో కాలనీవాసులు అధికారులను కలిసి తమ అభ్యంతరాలను వివరించారు.ఎస్.ఎస్. ప్రసాద్‌రావుకు జారీ చేసిన భవన నిర్మాణ అనుమతి కాలనీకి చెందిన పార్కు స్థలానికేనని వారు ఆరోపించారు.
కాలనీ ఆమోదిత లేఅవుట్‌లో ఈ స్థలం పార్కుగా నమోదై ఉందని, గతంలో అక్కడ బావి కూడా ఉండేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఓపెన్ స్పేస్‌లో ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం చట్టబద్ధం కాదని, దీనివల్ల కాలనీ ప్రజల హక్కులు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నిర్మాణ అనుమతిని తక్షణమే రద్దు చేయడంతో పాటు, సంబంధిత భూమిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరారు. అలాగే పార్కు స్థలాన్ని యథాతథంగా పరిరక్షించి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రంపై అధికారులు సానుకూలంగా స్పందించి నిబంధనల ప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అల్వాల్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Medchal -Malkajgiri District
పార్కు స్థలంలో నిర్మాణాలకు అనుమతులా? భీంరావు కాలనీలో వివాదం.. బిల్డింగ్ పర్మిట్ రద్దు చేయాలని నివాసితుల డిమాండ్
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని

