ఇంట్లోకి చొరబడిన భారీ అనకొండ కలకలం
బొల్లారం కొత్తబస్తీలో భయాందోళనలో స్థానికులు.అటవీ శాఖ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూలై 8 మన వార్త ఆల్వాల్ మండలం బొల్లారం కొత్తబస్తీలో ఓ ఇంట్లో భారీ అనకొండ తరహా పాము కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటి ఆవరణలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం క్షణాల్లోనే కాలనీలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని పామును చూసేందుకు గుమిగూడారు. పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పామును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అటవీ శాఖ లేదా సంబంధిత రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చి సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనతో బొల్లారం కొత్తబస్తీలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Medchal -Malkajgiri District
ఇంట్లోకి చొరబడిన భారీ అనకొండ కలకలం బొల్లారం కొత్తబస్తీలో భయాందోళనలో స్థానికులు.. అటవీ శాఖ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని