వేములవాడ, జూలై 9 (మన వార్త )
టీయూడబ్ల్యూజే హెచ్-143 వేములవాడ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్ లు , టౌన్ సీఐ.వీరప్రసాద్ గురువారం ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ సభ్యులు డీఎస్పీ, సీఐలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సత్కరించి, శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.
అనంతరం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను డీఎస్పీ శ్రీనివాస్ లు , టౌన్ సీఐ వీరప్రసాద్ శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్థంభంగా కీలక బాధ్యతను నిర్వర్తిస్తోందని అన్నారు. ప్రజలకు వాస్తవాలను నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పోలీసు శాఖ–మీడియా పరస్పర సహకారం అవసరమని చెప్పారు.
వాస్తవాధారిత వార్తలతో ప్రజల్లో మీడియాపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్న డీఎస్పీ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పాత్రికేయుల సంక్షేమం కోసం కూడా నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్, జిల్లా క్రమశిక్షణ కమిటీ సభ్యుడు సయ్యద్ రసూల్, ప్రెస్‌క్లబ్ ముఖ్య సలహాదారులు కొత్వాల్ శ్రీనివాస్, జితేందర్‌రావు, ఉపాధ్యక్షులు సీహెచ్ దేవరాజ్, విష్ణు, కోశాధికారి పంపరి నాగరాజు, ఫాహద్, జింక శ్రీధర్, కమటాల విజయ్, దెబ్బేటి ప్రవీణ్, శ్రీరామోజు వేణు, సంటి రాజేందర్, షబ్బీర్, గంగాధర్, పండుగ స్వామి, నవీన్, ఆసీమ్, లక్ష్మీనారాయణ, రాములు తదితరులు పాల్గొన్నారు.
Telangana
ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గానికి డీఎస్పీ శ్రీనివాస్ లు అభినందనలు బాధ్యతాయుత జర్నలిజంతో ప్రజలకు సేవ చేయాలి – డీఎస్పీ శ్రీనివాస్ లు...
Quick Summary:
వేములవాడ