ఇల్లంతకుంట,జూలై 17 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం (జూలై 18) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు TGNPDCL ఏఈ రంగు నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.132 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని ఇల్లంతకుంట,సోమవారంపేట,అనంతగిరి,పెద్దలింగాపురం,చీర్లవంచ,రామచంద్రాపూర్,రహీంకాన్‌పేట,కందికట్కూర్ 33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ సమయంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని TGNPDCL అధికారులు విజ్ఞప్తి చేశారు.
Telangana
మరమ్మతు పనులు...రేపు కరెంటు కోత...పలు గ్రామాల్లో నాలుగు గంటలు విద్యుత్ అంతరాయం
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త