వీధి దీపాలు లేక సాయి రెడ్డి కాలనీ వాసులకు ఇబ్బందులు,
త్వరితగతిన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికుల విజ్ఞప్తి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,జూలై 24 మన వార్త : అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని 191 మచ్చ బొల్లారం డివిజన్ సాయి రెడ్డి కాలనీలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో కాలనీలో పూర్తిగా చీకట్లు అలుముకోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
సంబంధిత అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు పేర్కొన్నారు. వెంటనే స్పందించి వీధి దీపాలను మరమ్మతు చేసి వెలిగేలా చర్యలు చేపట్టాలని వారు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.
ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Medchal -Malkajgiri District
వీధి దీపాలు లేక సాయి రెడ్డి కాలనీ వాసులకు ఇబ్బందులు, త్వరితగతిన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికుల విజ్ఞప్తి.
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని

