మచ్చ బొల్లారం డివిజన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం,
ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం – కాంగ్రెస్ నాయకుడు బొబ్బిలి సురేందర్ రెడ్డి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,జూలై 25 మన వార్త : రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, బొబ్బిలి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మచ్చ బొల్లారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఓటరు జాబితాలో పేర్లు నమోదు, సవరణ, మార్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, సురేందర్, సందీప్ రెడ్డి, దేవా, వెంకటేష్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో పేరు లేకుండా ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సవరణ ప్రక్రియను విజయవంతం చేయడానికి తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నామని చెప్పారు.
స్థానిక ప్రజలు కూడా కాంగ్రెస్ నాయకుల చొరవను అభినందిస్తూ, ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం వల్ల ఓటరు నమోదు ప్రక్రియపై స్పష్టత వచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు విలువైనదని, ఈ తరహా కార్యక్రమాలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Medchal -Malkajgiri District
ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం – కాంగ్రెస్ నాయకుడు బొబ్బిలి సురేందర్ రెడ్డి..
Quick Summary:
మన వార్త ప్రతి నిధి :అంతోని
