వాజేడు కాంగ్రెస్ కు తీరని లోటు - సీనియర్ నేత దంతులూరి విశ్వనాథ ప్రసాద్ బాబురాజు కన్నుమూత
వాజేడు జులై 25 మనవార్త
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ బాబురాజు గుండెపోటుతో కన్నుమూశారు.
వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందారు.ఈ విషయం తెలిసి వాజేడు మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ బాబురాజు ఎప్పుడూ ప్రజలతో కలిసి మెలిసి ఉండేవారు.పార్టీ కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు.మృతదేహాన్ని ఆదివారం ( ఈరోజు ) సాయంత్రంలోపు వాజేడు మండల కేంద్రంలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Telangana
వాజేడు కాంగ్రెస్ కు తీరని లోటు - సీనియర్ నేత దంతులూరి విశ్వనాథ ప్రసాద్ బాబురాజు కన్నుమూత
Quick Summary:
కవిరాజు