ఢిల్లీ, జులై 26(మనవార్త )
ఢిల్లీలో టిడబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఏర్పాటుచేసిన జర్నలిస్టుల ధర్నా కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులందరూ నిర్ణీత సమయానికి ధర్నా స్థలానికి చేరుకోవాలని అన్నారు. ఈ ధర్నా ఉదయం 10. 00 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు MP లు, IFWJ, TWJF నేతలు పాల్గొంటున్నట్టు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను టిడబ్ల్యుఎఫ్ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని, రేపు జరిగే ఈ ధర్నా ను జయప్రదం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
Telangana
టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీ జంతర్ మంతర్ లో జర్నలిస్టుల ధర్నా...
Quick Summary:
Mana vaartha, telangana