చేపలు పట్టేందుకు వెళ్లి... గోదావరిలో మునిగి వ్యక్తి మృతి
వాజేడు జులై 26 మనవార్త
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన గౌరారపు రామచంద్రం (55) ఆదివారం గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రం ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు అయ్యవారిపేట సమీపంలోని గోదావరి నది తీరానికి వెళ్లాడు.అక్కడ స్నానం చేసేందుకు నదిలోకి దిగగా లోతు అంచనా వేయలేక నీటిలో మునిగిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేరూరు ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ తెలిపారు.
Telangana
చేపలు పట్టేందుకు వెళ్లి... గోదావరిలో మునిగి వ్యక్తి మృతి
Quick Summary:
కవిరాజు