ఉదయ్ ఆర్ట్ 3డి కార్వింగ్ గ్యాలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,జూలై 27 మన వార్త :అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ ఐస్ ఫ్యాక్టరీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఉదయ్ ఆర్ట్ 3డి కార్వింగ్ గ్యాలరీని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి గ్యాలరీని ప్రారంభించి, నిర్వాహకుడు ఉదయ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వ్యాపార రంగంలో అడుగుపెట్టిన యువ పారిశ్రామికవేత్తలు నిరంతరం కృషి చేసి మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇటువంటి నూతన వ్యాపార సంస్థలు మరిన్ని ఏర్పడటం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించే 3డి కార్వింగ్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్యాలరీ నిర్వాహకుడు ఉదయ్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతతో నాణ్యమైన 3డి కార్వింగ్ సేవలను అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, నర్ల సురేష్, ఢిల్లీ పరమేష్, శోభన్, అరుణ్ రావు, భాస్కర్ రెడ్డి, పవన్, రేవంత్, మహేష్, రెహ్మత్ ఖాన్, నర్సింగ్ రావు, గణేష్, దేవేందర్, ఫెరోజ్, అతిక్ పాషా, బంటి, వర్ష తదితరులు పాల్గొని గ్యాలరీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
Medchal -Malkajgiri District
ఉదయ్ ఆర్ట్ 3డి కార్వింగ్ గ్యాలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..
Quick Summary:
మన వార్త ప్రతి నిధి :అంతోని