ఇల్లంతకుంట, ఆగస్టు 10: (మన వార్త ప్రతినిధి);
ఇల్లంతకుంట మండలంలో రహదారుల దుస్థితి ప్రజలకు శాపంగా మారింది.పెద్దలింగాపూర్–అనంతగిరి ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. అనంతగిరి పోచమ్మ దేవాలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు.అన్నపూర్ణ రిజర్వాయర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.అయినా రహదారి మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోవడంతో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు,భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్యతో అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*మండలవ్యాప్తంగా రహదారులదీ ఇదే పరిస్థితి.*
మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారడం, బ్రిడ్జిల వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి సమస్యలపై పలుమార్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమైనా అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.మండలంలోని రహదారులు బాగుండేలా చర్యలు తీసుకోవాలని,ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి వెంటనే భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు..ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్లే ప్రధాన రహదారిలోని అనంతారం–బిక్కవాగు బ్రిడ్జిపై కూడా భద్రతా సమస్య నెలకొంది. బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ కవచం లేకపోవడంతో మండలానికి వేలాదిమంది వాహనదారులు వస్తారు కాబట్టి అదుపుతప్పితే కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేసి బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ కవచాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
*బీజేపీ నిరసన..*
ప్రముఖ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వచ్చే ప్రధాన రహదారికే ఈ దుస్థితి ఉంటే అధికారులు ఇంకెప్పుడు స్పందిస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నించారు.గుంతలను వెంటనే పూడ్చడంతో పాటు, మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.అధికారులు తక్షణమే స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్,ఉపాధ్యక్షులు లచ్చయ్య మండల కార్యవర్గ సభ్యులు పయ్యావుల బాలయ్య,కునవేని అనిల్,పలుమారి రవి,సీనియర్ నాయకులు అమ్ముల అశోక్ రెడ్డి,ముత్యం రెడ్డి నాయకులు ఎగుర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
గుంతల రహదారులు..పట్టించుకునేదెవరు..? ● భక్తులకు తప్పని తిప్పలు ● బ్రిడ్జిపై భద్రత కరువు ● అధికారుల తీరుపై విమర్శలు ● రహదారులు బాగుచేయాలని బీజేపీ డిమాండ్
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త ప్రతినిధి..✍️
